ఖుషి పై ఆలోచనలలో మార్పులు !
‘లైగర్’ ఘోరపరాజయం చెందడంతో విజయ్ దేవరకొండ మార్కెట్ విపరీతంగా దెబ్బతింది అని అంటున్నారు. మీడియం రేంజ్ హీరోలలో టాప్ హీరో అవుతాడు అని భావించిన విజయ్ కు వరస పరాజయాలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ తప్పించి మరే మూవీ సెట్స్ పై లేవు.
దర్శకుడు శివ నిర్వాణ ఈమూవీని క్యూట్ లవ్ స్టోరీగా కాశ్మీర్ నేపధ్యంలో తీస్తున్నాడు. కాశ్మీర్ నేపధ్యంలో వచ్చిన ప్రేమ కథలు చాలవరకు బ్లాక్ బష్టర్ హిట్ అయ్యాయి. అయితే ఆప్రేమ కథను ఈనాటితరం ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీయవలసి ఉంటుంది. ‘లైగర్’ సూపర్ హిట్ అయి తీరుతుంది అన్న నమ్మకంతో శివ నిర్వాణ చెప్పిన ‘ఖుషీ’ కథకు మరొక ఆలోచన లేకుండా విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘టక్ జగదీష్’ ఫెయిల్ అవ్వడంతో శివ నిర్వాణ పై కూడ కొన్ని సందేహాలు ఉన్నాయి. దీనితో ‘ఖుషీ’ కథను మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి అవసరం అనుకుంటే ఈమూవీ కథలో ఏమైనా మార్పులు చేయాలా అన్న ఆలోచన విజయ్ లో మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో అవసరం అనుకుంటే ఈమూవీ విడుదల తేదీ విషయంలో ఖంగారు పడకుండా వచ్చే ఏడాదికి మార్చి ఈమూవీ అవుట్ పుట్ విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్ ఆలోచన అని అంటున్నారు. ఈమూవీలో విజయ్ పక్కన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
డైవర్స్ తరువాత సమంత ప్రేయసి గా కనిపిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇది. ప్రస్తుతం సమంత యంగ్ హీరోయిన్ కాదు. ఇలాంటి పరిస్థితులలో ఒక లవ్ స్టోరీలో సమంత కనిపిస్తే యూత్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు అన్న సందేహాలు కూడ ఉన్నాయి. ఇలా రకరకాల సందేహాలు సమస్యలు ‘ఖుషీ’ విషయంలో ఉండటంతో ఈమూవీ విడుదల ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు..