నోరు జారిన మెగాస్టార్ కి యంగ్ టైగర్ పంచ్?

Purushottham Vinay
టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో సక్సెస్ రేటు చాలా తక్కువుగా ఉంటుంది. జూన్‌ నెలలో ఒక్క మేజర్ సినిమా మాత్రమే ఆడింది. కమల్ హాసన్ డబ్బింగ్ మూవీ విక్రమ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.జూలై నెలలో ఒక్క హిట్టు కూడా లేదు.ఆగస్టు నెలలో బింబిసార, కార్తీకేయ 2,సీతారామం సినిమాలు మంచి హిట్ అయ్యి ఆశలు నిలిపాయి. కానీ ఈ ఆగస్టులో 19 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 3 మాత్రమే హిట్ అయ్యాయి అంటే సక్సెస్ రేటు ఎంత తక్కువుగా ఉందో తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చీదేశాయి. చిరంజీవి ఇంకా రామ్‌చరణ్ కలిసి చేసిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.ఆచార్య సినిమా డిజప్పాయింట్‌మెంట్ మెంట్ చేశాక చిరు ఎంచుకున్న ప్రాజెక్టులు ఆయన ఫ్యాన్స్‌కే నచ్చడం లేదు. ఏదేమైనా ఆచార్య చిరు ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలోనే చిరు ఇటీవల ఒకటి రెండు ఫంక్షన్లలో ఆచార్య ఫలితంతో పాటు ఆ సినిమా డైరెక్టర్ కొరటాల శివపై అసహనం వ్యక్తం చేశాడు. రెండు రోజుల క్రితం కూడా ఓ ఈవెంట్లో  మాట్లాడుతూ డైరెక్టర్లకు కొన్ని సలహాలు ఇచ్చారు.డైరెక్టర్లు సరిగా ఉండకపోతే ప్లాప్స్ వస్తాయని. అందుకు తన సినిమానే ఉదాహరణ అని చెప్పారు. చిరు అన్నది అచార్య సినిమాను ఉద్దేశించే. అది కూడా కొరటాలనే ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది.


డేట్లు క్లాష్ అవుతున్నాయనో లేక మరొకటి అనో కంగారుగా షూటింగ్ చేయవద్దని మీ మీద ఇండస్ట్రీయే ఆధారపడి ఉందన్న విషయం గుర్తుంచు కోవాలని చిరంజీవి అన్నారు. చిరు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన కొరటాల శివను ఉద్దేశించే ఈ మాటలు అన్నారన్న గాసిప్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతా కొరటాలదే తప్పు అన్నట్టుగా చిరు కామెంట్లు ఉన్నాయన్న చర్చ బాగా నడుస్తోంది. ఈ టైంలో కొరటాలకు అత్యంత సన్నిహితుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాలకు సపోర్ట్ చేస్తూ చిరుకు కౌంటర్ ఇచ్చారన్న కొత్త చర్చ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఒత్తిడికి లోనవుతోంది. ప్రేక్షకులు ఏదో కొత్తగా కావాలని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకుని తన వరకు తాను బాగా నటించాలని కోరుకుంటానని ఇంకా ఈ ఒత్తిడిని ఇండస్ట్రీ ఓ ఛాలెంజింగ్‌గా స్వీకరించాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి.. ఇది అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని తారక్ చెప్పాడు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. కొరటాలకు సపోర్ట్‌గానే ఎన్టీఆర్ ఇలా మాట్లాడాడు అని అలాగే ఇండస్ట్రీయే ఒత్తిడిలో ఉంది. దీనికి ఏ ఒక్కరు కారణం కాదు.. ఏ ఒక్కరిని నిందించాలనుకోవడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ అప్‌డేట్ అవ్వాలని చెప్పడంతో మెగాస్టార్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పంచ్ ఇచ్చారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: