బాలీవుడ్ పై విజయ్ అతర్మధనం !

Seetha Sailaja
ఈసంవత్సరం ప్రారంభం నుండి విడుదల అవుతున్న బాలీవుడ్ భారీ సినిమాలు వరస పరాజయం చెందడంతో అయోమయంలో పడ్డ బాలీవుడ్ విజయ్ దేవరకొండ పై పెట్టుకున్న ఆశలు కూడ నీరుకారిపోయాయి. వాస్తవానికి ఈమూవీ వెనుక కరణ్ జోహార్ ఉండటంతో ఎదో ఒక అద్బుతం జరుగుతుందని చాలామంది భావించారు అయితే ఎటువంటి అద్భుతం జరగలేదు.



ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో బాలీవుడ్ కు చెందిన కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్త్గలు ‘లైగర్’ విడుదల కాకముందు కొందరు దర్శకులను పంపించి విజయ్ ను కొన్ని కథలు వినమని చెప్పారట. అయితే అప్పట్లో ‘లైగర్ పై మితిమీరిన నమ్మకంతో ఉన్న విజయ్ ఈ మూవీ విడుదల తరువాత తాను ఆకథలు వింటాను అని చెప్పాడట. ఇప్పుడు ‘లైగర్’ ఫెయిల్ కావడంతో విజయ్ ని కాంటాక్ట్ చేసిన ఆప్రముఖ నిర్మాణ సంస్థలు విజయ్ విషయంలో మౌనాన్ని పాటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

వాస్తవానికి ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియనప్పటికీ ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాలు రెండు మాత్రమే. సమంత తో ‘ఖుషీ’ పూరీజగన్నాథ్ తో ‘జన గణ మన’ సినిమాలు తప్ప విజయ్ దేవరకొండ  ఒప్పుకున్నా మరే సినిమాలు లేవు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘లైగర్’ మూవీ అత్యంత భారీ స్థాయిలో ఫ్లాప్ కావడంతో పూరీ జగన్నాథ్ తో చేయవలసిన ‘జన గణ మన’ విషయమై విజయ్ కు మరొక ఆలోచన ప్రారంభం అయిందని కొంతకాలం వరకు ఈమూవీ షూటింగ్ ను పోస్ట్ పోన్ చేయించే ఉద్దేశ్యంలో విజయ్ ఉన్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ గాసిప్పులను పూరీ సన్నిహితులు ఖండిస్తున్నారు విజయ్ దేవరకొండ ఈ మూవీని పూర్తిచేసి తీరుతాడు అని కూడ అంటున్నారు. అయితే ఈ యంగ్ హీరో మాత్రం ప్రస్తుతం తనను బాదిస్తున్న బ్యాక్ పెయిన్ కంట్రోల్ అయ్యేవరకు పూరీతో చేయవలసి ఉన్న ఈమూవీని వాయిదా వేయమని ఇప్పటికే విజయ్ సందేశాలు పంపుతున్నాడు అంటూ మరికొందరు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: