రవితేజ 'రామారావు అండ్ డ్యూటీ' మూవీ టోటల్ కలెక్షన్ ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ తాజాగా రామారావు అండ్ డ్యూటీ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించక దివ్యాన్షా కౌశిక్ , రాజేష విజయన్  ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


నైజాం : 1.43 కోట్లు .
సీడెడ్ : 73 లక్షలు .
యూ ఏ : 65 లక్షలు .
ఈస్ట్ : 42 లక్షలు .
వెస్ట్ : 21 లక్షలు .
గుంటూర్ : 37 లక్షలు .
కృష్ణ : 34 లక్షలు .
నెల్లూర్ : 16 లక్షలు .
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రామారావు అండ్ డ్యూటీ మూవీ 4.31 కోట్ల షేర్ , 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 0.37 కోట్లు .
ఓవర్ సీస్ లో : 52 లక్షలు .

 
ప్రపంచ వ్యాప్తంగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ 5.20 కోట్ల షేర్ , 9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మొత్తం బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా12.50 కోట్ల నష్టాలను మిగిల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: