తాతా మనవడు నేపధ్యంలో ప్రభాస్ !
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందా ఉండదా అన్న సందేహాలకు క్లారిటీ ఇస్తూ ఎట్టకేలకు ఈమూవీ పూజా కార్యక్రమాలు జరిగిపోవడంతో మూవీ పై క్లారిటీ వచ్చింది. గోపీచంద్ తో మారుతి చేసిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ మారుతి వైపు చూస్తాడా అన్నసందేహాలకు కూడ క్లారిటీ వచ్చేసింది.
‘రాజా డీలక్స్’ టైటిల్ తో నవంబర్ లో షూటింగ్ ప్రారంభం జరుపుకోబోతున్న ఈమూవీకి కథకు సంబంధించిన లీకులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈమూవీ కథ అంతా తాతా మనవడు చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. తాత పాత్రలో ఎవరు నటిస్తారు అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా మనవడి పాత్రలో మటుకు ప్రభాస్ నటించబోతున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే విలువైన ఆస్థి తాత చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలలో పడినప్పుడు ఆ ఆస్థిని తిరిగి మనవడు ఎలా దక్కించుకున్నాడు అన్న పాయింట్ చుట్టూ కథ ఉన్నప్పటికీ కథ అంతా కామెడీ ట్రాక్ లో ఉంటుంది అని అంటున్నారు.
కామెడీ సినిమాలను తీయడంలో సిద్ధహస్తుడైన మారుతి ఈమూవీ కోసం చాల డిఫరెంట్ స్క్రీన్ ప్లే వ్రాసాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ‘రాజా డీలక్స్’ పేరుతో ఒక భారీ మహల్ నిర్మాణం జరిగింది అని తెలుస్తోంది. ఈమూవీలో తాతా మనవడి పాత్రతో పాటు సైడ్ ట్రాక్ లో ఒక దెయ్యం పాత్ర కూడ ఉంటుంది అని అంటున్నారు.
మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా ప్రభాస్ పక్కన ఈమూవీలో నటిస్తోంది. ఈమూవీని కేవలం రెండు షెడ్యూల్స్ లో చాల వేగంగా పూర్తి చేసే విధంగా మారుతి పక్కా ప్లాన్ తో ఉన్నాడని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ప్రభాస్ కామెడీ సినిమా చేసి చాల కాలం అవుతోంది. ప్రేక్షకులకు మార్పుగా ఉంటుందని ప్రభాస్ ఈమూవీని అంగీకరించాడు అని అంటున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్టు చాల ఎక్కువగా ఉన్న పరిస్థితులలో మారుతి తాను కోరుకున్న విధంగా ఈసినిమాను ఎంతవరకు వేగంగా పూర్తి చేయగలడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..