తాజాగా విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమాకు వచ్చిన హైప్ ఓ రేంజ్ లో ఉంటే..దాని రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది.చెప్పాలంటే ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యాయనే చెప్పాలి.అయితే పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేస్తుందనుకున్న లైగర్ కాస్తా.. ఏ భాషలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.ఇక దీంతో విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో చేస్తున్న మరో మూవీపై లైగర్ ఎఫెక్ట్ పడినట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక దీంతో మాస్ ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. కరోనా వల్ల ఆ మూవీ కాస్త ఇన్నేళ్లకు రిలీజైంది. పోతే పూరీ సినిమాలంటే.. హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్, డైలాగ్స్ ఉంటాయి. ‘లైగర్’ విషయంలో అది మిస్సయింది. అంతేకాదు దీంతో అటు పూరీ ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. వీరి కాంబోలో తీసిన లైగర్ సెట్స్ పై ఉండగానే.. JGM అనే మూవీ ప్రారంభించేశారు. అంతేకాదు ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే లైగర్ హిట్ అయ్యుంటే ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగేవేమో. లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది.
ఇక దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘JGM’విషయంలో పూరీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.అయితే లైగర్ రిజల్ట్ ఎఫెక్ట్ వల్ల స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇకపోతే దేశభక్తి- ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో ఉండే ఈ స్టోరీని.. మహేశ్ బాబుతో తీయాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనుకున్నారు. సూపర్ స్టార్ తో సెట్ అయ్యేలా కనిపించక పోవడంతో విజయ్ తో ప్లాన్ చేశారు. సెట్స్ పైకి కూడా తీసుకెళ్లారు.కాగా ఇప్పుడు పూరీ మార్పులు చేయడం అనే న్యూస్… JGM చిత్రానికి హెల్ప్ అయితే సరేసరి. విజయ్-పూరీ వరస ప్లాఫ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.మరి పూరి జగన్నాథ్ ఈ సినిమా విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తాడో చూడాలి...!!