అలనాటి కాలంలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన రమ్యకృష్ణ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రమ్యకృష్ణ అప్పట్లో తెలుగు మరియు తమిళ భాష సినిమాల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఇటు తెలుగు మరియు అటు తమిళ్ రెండు ఇండస్ట్రీ లోనూ అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రమ్యకృష్ణ తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ సినిమా లలో ముఖ్యమైన పాత్ర లలో నటిస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తమిళ క్రేజీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పెరకెక్కుతున్న జైలర్ మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇది వరకు రజనీ కాంత్ , రమ్య కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన నరసింహ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జైలర్ మూవీ పై రజనీ కాంత్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ లో రమ్యకృష్ణ ఒక అదిరిపోయే పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
అలాగే రమ్యకృష్ణ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రమ్యకృష్ణ తో పాటు ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా , ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.