మంచి కథలో నేను ఉంటే చాలు అని అనుకుంటాను... శర్వానంద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి , ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని హీరోగా ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న శర్వానంద్ గత కొంతకాలంగా బాక్సా ఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో వెనుకబడి పోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ హీరో శర్వానంద్ ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.


ఈ ఇంటర్వ్యూలో భాగంగా శర్వానంద్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు  తాజా ఇంటర్వ్యూలో భాగంగా శర్వానంద్ మాట్లాడుతూ ... కథల విషయంలో నేను కొత్తదనానికీ .. సహజత్వానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాను. అలా సెలెక్ట్ చేసిన స్టోరీ లలో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని ఫెల్ అయ్యాయి. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీ ని చేస్తుంటే, చాలా మంది వద్దు అన్నారు. అయిన కూడా చేయటం వలన నా కెరియర్ లో చెప్పుకోదగిన మూవీ గా నిలిచింది. నాతో ఎవరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు... ఎవరికి ఎంత స్పేస్ వెళ్లిపోతోంది...  అనే ఆలోచన చేయను. మంచి కథలో నేను ఉంటే చాలానే అనుకుంటున్నాను అంటూ శర్వానంద్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: