దృశ్యం పార్ట్ 3 కూడా రాబోతుంది..!

Pulgam Srinivas
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో సీక్వెల్ మూవీ ల జోరు ఫుల్ గా నడుస్తుంది. ఏదైనా మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే ఆ మూవీ కి సీక్వెల్ ని తీయడానికి హీరోలు మరియు దర్శక నిర్మాతలు ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సీక్వెల్ మూవీ లు విడుదల కాగా అందులో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను కూడా బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాయి.


అలా మామూలు అంచనాలతో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ మూవీ కి సీక్వెల్స్ ను తెరకెక్కించి ఆ సీక్వెల్ తో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో దృశ్యం సినిమా ఒకటి. చాలా కాలం క్రితం విడుదల అయిన దృశ్యం సినిమా మలయాళం లో మంచి విజయం సాధించింది. మలయాళ దృశ్యం మూవీ లో మోహన్ లాల్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ఈ మూవీ ఇతర హీరోలతో ఇతర భాషలలో రీమేక్ అయ్యి  దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా మంచి విజయాలను అందుకుంది. తెలుగు దృశ్యం మూవీ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు.


తెలుగు లో కూడా దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే దృశ్యం 2 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  దృశ్యం 2 మూవీ లో మోహన్ లాల్ హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమిక్ చేయగా,  తెలుగు లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో దృశ్యం 3 మూవీ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దృశ్యం మూడవ భాగంతో తిరిగి వస్తుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: