ప్చ్ పాపం... పూరి జగన్నాధ్ మూడేళ్ళ శ్రమ వృధా ?

VAMSI
టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ఒక మార్క్ ఉంది. తన కెరీర్ లో ప్రత్యేక శైలితో సినిమాలను తెరకెక్కిస్తూ అందరి చేత ప్రశంసలను అందుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ డైరెక్టర్ నుండి లైగర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మొదటి షో నుండి నెగటివ్ టాక్ వస్తోంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మరియు అనన్య పాండే హీరోయిన్ గా చేసింది. మిగిలిన పాత్రలు రమ్యకృష్ణ, హాలీవుడ్ క్రీడాకారుడు మైక్ టైసన్ లాంటి వారు నటించారు. అయితే సినిమాపై ఏ ఒక్కరూ కూడా పాజిటివ్ గా స్పందించకపోవడం చూస్తుంటే విజయ్ మరియు పూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా బలంగా నమ్మారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఓవరాల్ గా చూస్తే.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. పూరి డ్రాప్ లో ఉన్నప్పుడు రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే యాక్షన్ మూవీ తీసి మళ్ళీ తన పునరాగమనాన్ని బలంగా చాటాడు. ఈ సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు లైగర్ తో ప్రేక్షకులకు నిరాశను మిగిల్చాడు. పూరి సినిమాలో ఉండే మార్క్, మ్యాజిక్ మిస్ అవ్వడం ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్  చేస్తోంది. దీనితో పూరి జగన్నాధ్ పై ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమా పూరి జగన్నాధ్ అన్ని కోట్లు మరియు మూడు సంవత్సరాల పాటు శ్రమించింది అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.

అలా పూరీ జగన్నాధ్ తమ టీం తో మూడేళ్లు పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. సినిమా మొత్తంలో మొదటి అర్ధభాగం మినహా ఏదీ బాగాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. హీరోయిన్, మైక్ టైసన్, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ ఈ సినిమాను పూర్తిగా దెబ్బేశాయి.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: