నెపోటిజంపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..!!

Divya
నెపోటిజం అనేది సినీ ఇండస్ట్రీలో వారసత్వం . ఈ విషయం ఎక్కువగా బాలీవుడ్లో చర్చ జరుగుతున్న అంశమని చెప్పవచ్చు. ఎందుచేత అంటే..అక్కడ స్టార్ సెలబ్రిటీస్ కిడ్స్ సైతం ఎక్కువగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుచేతనే ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు రాలేదు అని హీరోయిన్ కంగానా తదితరులు ఇలాంటి వారి పైన అసంతృప్తి చెందుతూ ఉన్నారు. ఎంతగా నెపోటిజం గురించి ప్రచారం అవుతున్నప్పటికీ కూడా బాలీవుడ్లో మాత్రం ప్రతి ఏడాది ఎన్నో పదుల సంఖ్యలో స్టార్ కిడ్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా బాగా పేరుకు పోతోంది.

ఏ ఇండస్ట్రీ లోనైనా కూడా స్టార్స్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అందులో నిలబడేది మాత్రం కొద్ది మంది అని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేకే మాత్రం ఈ స్టార్ కిడ్ అనే పేరు ఉపయోగపడుతుంది ఆ తర్వాత కేవలం మన నటన మీదే ఆధారపడుతుందని చెప్పవచ్చు తాజాగా ఈ విషయంపై నాగచైతన్యకు ప్రశ్న ఎదురవగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నాగచైతన్య మాట్లాడుతూ సౌత్ లో నెపోటిజం చాలా ఎక్కువగానే ఉన్నది. ఇది ఎక్కడ ఎలా ప్రారంభమైందో తనకు అర్థం కాలేదు తన చిన్న వయసు నుండి మా తాత గారి నటనను చూస్తూ పెరగడం జరిగింది. మా నాన్నగారి సినిమాలను కూడా చూశాను వారిద్దరి స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఉన్నాను. అలాగే జరిగింది. ఏదైనా ఒక సందర్భంలో ఒకేరోజు నేను నటించిన సినిమా, ఇతర హీరోల సినిమా విడుదల అయ్యి వారి సినిమా రూ.100 కోట్లు సాధించి తన సినిమా రూ.10 కోట్లు సాధిస్తే అందరూ కూడా ఎక్కువగా ఆ హీరో గురించి మాట్లాడుతారు ఆ హీరోనే ప్రశంసిస్తూ ఉంటారు ఎక్కువగా వస్తాయి తప్ప స్టార్ కిడ్ అయినంత మాత్రాన తనను భరించారని తెలియజేశారు నాగచైతన్య. కేవలం స్టార్ కిడ్ అనేది ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి మాత్రమే ఈజీగా లభిస్తుంది పేరు సంపాదించాలి అంటే కష్టపడాల్సిందే అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: