బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిన విజయ్ 'బీస్ట్' మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక హిట్ , సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ కొనసాగిస్తున్న తళపతి విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అదిరిపోయే రేంజ్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన బీస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.


ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమా విడుదల తర్వాత కూడా ఈ మూవీ లోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మూవీ తెలుగు లో ఈ సినిమాని నిర్మాణం వహించిన సన్ పిక్చర్స్ వారి ఛానెల్ జెమినీ టీవీ లో ప్రసారం కావడానికి సిద్ధం అయ్యింది. కాకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ ప్రసారం అయ్యే తేదీని జెమినీ టీవీ ప్రకటించలేదు. త్వరలోనే ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: