కార్తికేయ2: దెబ్బకు రక్షాబంధన్ విలవిల?

Purushottham Vinay
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హిందీ సినిమాలు చాలా దారుణంగా బోల్తా పడుతున్నాయి. అదే సమయంలో సౌత్ సినిమాలకు అయితే రికార్డు స్థాయిలో భారీ వసూళ్లు అనేవి వస్తున్నాయి. ఇక గత వారం కూడా బాక్సాఫీస్ వద్ద ఇదే పరిస్థితి అనేది మనకు కనిపించింది.ఇంకా ఒకవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చిత్రం 'రక్షా బంధన్' సినిమా ఇంకా అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఎనిమిది రోజులలో వాటి ఖర్చును కూడా ఆ సినిమాలు రాబట్టలేకపోయాయి. ఇంకా అలాగే మరోవైపు తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ్ చిత్రం 'కార్తికేయ 2' సినిమా అయితే ఆరు రోజుల్లోనే 23 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పుడు 30 కోట్లకు చేరువైంది.ఆ రకంగా 'కార్తికేయ 2' హిందీ బాక్సాఫీస్ వద్ద 'రక్షా బంధన్'కి గట్టి పోటీనిస్తోంది. ఇక లెక్కలు చూస్తుంటే అక్షయ్ కుమార్ సినిమాని వదిలేసి 'కార్తికేయ 2' హిందీ వెర్షన్ చూసేందుకు ప్రేక్షకులు చాలా మంది కూడా థియేటర్లకు చేరుకుంటున్నారని చెబుతున్నారు.



గురువారం నాడు ఈ సినిమా హిందీలో ఏకంగా రూ.1.15 కోట్లు రాబట్టింది. అదే సమయంలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా కూడా రూ.1.71 కోట్లు వసూలు చేసింది.కార్తికేయ 2 కన్నా కాస్త ఎక్కువే రాబట్టినప్పటికీ రోజు రోజుకి రక్షా బంధన్ సినిమా అడుగులు ఫ్లాప్ దిశగా పయనిస్తున్నాయి.ఎందుకంటే 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన అక్షయ్ కుమార్ సినిమా ఎనిమిది రోజుల్లో కేవలం 57.28 శాతం మాత్రమే వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో, నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' సినిమా కేవలం ఆరు రోజుల్లో బడ్జెట్‌లో 98.16 శాతం వసూళ్లు రాబట్టింది.ఈ వారం రోజుల్లో అక్షయ్ కుమార్ సినిమా వసూళ్లు చాలా తగ్గిపోయాయి. ఇంకా అదే సమయంలో 'కార్తికేయ 2' సినిమా వసూళ్లు అయితే బాగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: