రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి అలాంటి మూవీ చేయబోతున్నాడా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే రామ్ చరణ్ ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి హీరో గా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేట్ చేసు కున్నాడు . ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగు తున్నాడు . రామ్ చరణ్ కొంత కాలం క్రితమే రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించు కున్నాడు . జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ లో హీరోగా నటించాడు . ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . 


ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం శంకర్ ఇండియన్ 2 అనే మూవీ ని మొదలు పెట్టి ఆ మూవీ కొన్ని కారణాల వల్ల ఆగి పోవడంతో రామ్ చరణ్ తో మరో మూవీ ని స్టార్ట్ చేశాడు . మరి కొన్ని రోజుల్లో ఇండియన్ 2 మూవీ ని శంకర్ తిరిగి ప్రారంభించ బోతున్నాడు . దానితో కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ సినిమా ఆగి పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . దానితో రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో నటించ బోతున్నట్లు సమాచారం . ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం గౌతమ్ తిన్ననూరి , రామ్ చరణ్ తో ఒక అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: