వైరల్ అవుతున్న లైగర్ స్టోరీ...!!
బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? అసలు ఫైటర్ ఎలా అయ్యాడు? రమ్యకృష్ణ నేపథ్యం ఏమిటీ? ఇలా మొత్తంగా స్టోరీ లీక్ అయ్యిందట.
టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ కాకరేపుతోందని తెలుస్తుంది. ఇక కథలోకి వెళితే... గతంలో పూరి తెరకెక్కించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్ర లేటెస్ట్ వర్షనే లైగర్ అన్న మాట వినిపిస్తోంది. రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన ఆ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ కలగలిపి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా పూరి ఆ చిత్రం చేశారు.
అదే తరహాలో లైగర్ కథ సాగనుందట. కరీంనగర్ కి చెందిన రమ్యకృష్ణ కొన్ని కారణాలతో ముంబై వెళ్ళిపోతుందట.అక్కడ ఓ స్లమ్ ఏరియాలో టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ముంబై లాంటి నగరంలో బ్రతకాలంటే తెగువ, ధైర్యం ఉండాలని... రూత్ లెస్ లేడీగా మారుతుంది. కొడుకు విజయ్ దేవరకొండను కూడా అలానే పెంచుతుందట..
ముంబై స్లమ్ ఏరియాలో పెరిగిన విజయ్ రౌడీగా పెరుగుతాడు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో తలదూర్చుతూ ఉంటాడు. అదే సమయంలో తల్లి రమ్యకృష్ణకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. లోకల్ గ్యాంగ్స్ తో కూడా విజయ్ కి గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో విజయ్ ఫైటింగ్ నేర్చుకోవాలి అనుకుంటాడట.
ఆ ఏరియాలో ఉన్న కోచ్ దగ్గర మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. అందులో విజయ్ మంచి ప్రతిభ చూపిస్తాడు. తల్లికి రమ్యకృష్ణకు ఈ విషయం తెలియదు. కొడుకు ఫైటర్ అయ్యాడని తెలుసుకొను, వద్దని వారిస్తుంది. విజయ్ ఫైటర్ కావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినప్పటికీ విజయ్ గొప్ప ఫైటర్ గా ఎదిగి ఇంటర్నేషనల్స్ కి కూడా సెలెక్ట్ అవుతాడు.
అయితే లోకల్ రాజకీయాల కారణంగా విజయ్ కి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో పాల్గొనే ఛాన్స్ పోతుంది. దానితో క్రుంగిపోయిన విజయ్ కెరీర్ వదిలేసి వీదుల్లో తిరుగుతూ ఉంటారు. దానితో రమ్యకృష్ణ మళ్ళీ ఫైటర్ కావడం ద్వారానే సెట్ అవుతాడని ప్రాక్టీస్ మొదలు పెట్టమంటుంది. విజయ్ మాత్రం నేను ఇక ఫైట్ చేసేది లేదంటాడు. అప్పుడు రమ్యకృష్ణ తన నేపథ్యం చెబుతుంది. తన తండ్రి గురించి షాకింగ్ విషయాలు కూడా వెల్లడిస్తుంది.
తన గతం తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఏం చేశాడు? అతడు మళ్ళీ ఫైటర్ అయ్యాడా? ఇంటర్నేషనల్స్ లో గెలిచి తన కల నెరవేర్చుకున్నాడా? ఈ తల్లీ కొడుకుల కథ ఎలా ముగిసిందనేది అనేది మిగతా కథని సమాచారం.మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అయితే అవుతుంది.