అబ్బో! చైతు మన్మధుడే?

Purushottham Vinay
ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కనిపించేంత అమాయకుడు ఏమి కాదు. మన్మధుడే. ఒకసారి కారులో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులే అది కొన్నేళ్ల క్రితం జరిగింది.పైగా ఈ సీక్రెట్ ను చైతునే స్వయంగా బయట పెట్టారు. వాస్తవానికి చైతు చాలా సైలెంట్‌గా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో గానీ ఇంకా ఇంటర్వ్యూల్లో గానీ వ్యక్తిగత విషయాలను పెద్దగా షేర్ చేసుకునేందుకు ఇష్టపడరు.కానీ, తాజాగా మాత్రం ఓ బిగ్ సీక్రెట్‌ను చైతు రివిల్ చేశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య రీసెంట్‌గా `లాల్ సింగ్ చద్దా` మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఆగస్టు 11 వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైతు ఓ జాతీయ మీడియాకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు.


ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్ కారులో రొమాన్స్ విషయంపై ప్రస్తావించాడు. దాంతో చైతు ఇక వెంటనే మాట్లాడుతూ.. `ఓసారి హైదరాబాద్ లో కారు బ్యాక్ సీట్ లో కూర్చుని అమ్మాయికి ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయాం` అంటూ చాలా ఓపెన్‌గానే చెప్పేశాడు.ఇక ఆయన మాటలకు ఒకింత షాకైన యాంకర్‌.. మరి మీకు అప్పుడు భయం వేయలేదా అని ప్రశ్నించాడు. దానికి చైతు `నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అందుకే భయం లేదు` అని నవ్వుతూ చైతూ బోల్డ్ రిప్లై ఇచ్చాడు. ఇక ఆ అమ్మాయి ఎవరు ఇంకా ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అన్న విషయాలను చైతు రివిల్ చేయకపోయినా.. ఇది ఇక ఆయన కాలేజ్ డేస్‌లోనే జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే చైతు మంచి మన్మధుడే అంటూ సరదాగా నెటిజన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: