బ్రహ్మస్త్ర గుంపు నిద్రలేస్తే మంచిది.. లేదంటే?

Purushottham Vinay
ఇటీవలే విడుదలైన లాల్ సింగ్ చడ్డా ఇంకా రక్షా బంధన్ సినిమాల డిజాస్టర్ల దెబ్బకు బాలీవుడ్ దెబ్బకు కకాలవికలమైపోయింది. ఈ సమస్య కంటెంట్ లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా బాయ్ కాట్ నినాదాలు అమీర్ ఖాన్ మూవీ మీద చాలా బలంగా ప్రభావం చూపించిన మాట వాస్తవం.లేకపోతే కనీసం మొదటి రోజైనా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ అనేవి దక్కేవి.ఇక అది కూడా జరగలేదంటే ప్రేక్షకుల్లో అతని పట్ల బలమైన వ్యతిరేకతే కారణం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ. సెప్టెంబర్ 9 వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న విజువల్ గ్రాండియర్ ఇది.దీనికీ నిరాసన సెగలు అనేవి తప్పడం లేదు. అయితే ఇందులో హీరోగా నటించిన రన్బీర్ కపూర్ పాత్రకు ముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని అనుకున్నారట. కానీ నిర్మాత కరణ్ జోహార్ ప్రోద్బలంతో ఆ పేరు మారిపోయిందని, ఇలాంటి పెద్ద అవకాశం కోల్పోవడం సుశాంత్ ను ఏకంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాల్లో ఒకటని ఒక వర్గం నెటిజన్లు చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు.


దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. బ్రహ్మాస్త్ర సినిమాను కూడా చూడకూడదని పిలుపునిస్తూ పోస్టులు చేస్తున్నారు.ఇక ఇదంతా ఎలా ఉన్నా సినిమాలో మ్యాటర్ అనేది ఉంటే ఇవేవీ పనిచేయవు కానీ అసలు ఫస్ట్ డే ఫస్ట్ షోకు జనాలను రప్పించడమే హిందీ నిర్మాతలకు చాలా పెద్ద సవాల్ గా మారింది. సినిమా బాగుందంటే ఎలాగూ అది పబ్లిక్ టాక్ రూపంలో బయటికి వెళ్తుంది. అసలు థియేటర్ దాకా రాకపోతేనే కదా అసలు సమస్య వచ్చేది. ఇంకో రెండు భాగాలు ప్లానింగ్ లో ఉన్న బ్రహ్మాస్త్రలో నాగార్జున ఇంకా అమితాబ్ బచ్చన్ లాంటి బలమైన క్యాస్టింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలో ప్రమోషన్లు చేయకపోవడం దీనికి ఇబ్బంది కలిగించేలా ఉంది. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని ఆ పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం.లేదంటే ఈ సినిమా కూడా అస్సాం అవ్వడం ఖాయమంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: