F-3 చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పరుచూరీ గోపాలకృష్ణ..!!
తాజాగా f3 సినిమా అని చూశాను.. ఈ సినిమా చూసిన తర్వాత తను చేసిన వాక్యాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక పరుచూరి గోపాలకృష్ణ గత కొన్ని రోజుల నుంచి పరుచూరి పలుకులు పేరుతో సినిమాలు తారలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా అలనాటి సినిమాలకు సంబంధించిన పలు విషయాలను జ్ఞాపకాలను తెలియజేస్తూ అభిమానులను కాస్త ఆనందపరుస్తూ ఉంటారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల మీద కూడా తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉంటారు ఈయన.
అయితే ఇప్పుడు తాజాగా f3 సినిమాలను సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు అసలు వెంకటేష్ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారు తనకి అర్థం కావలేదని ఎఫ్2 లో ఉన్న సోల్ ఈ సినిమాలో కనిపించలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతోంది. అయితే వెంకటేష్ మాత్రం ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించి మంచి నటుడుగా గుర్తింపు సంపాదించారు.