లైగర్ కోసం విజయ్ అంత చేస్తున్నాడా!!

P.Nishanth Kumar
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషలలో విడుదల కాబోతుంది. హిందీ తెలుగు భాషలతో పాటు కన్నడ తమిళ మలయాళ భాషలలో సైతం ఈ చిత్రం విడుదల అవుతుండడం విశేషం. ఈ నేపద్యంలో ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను శేరవేగంగా చేస్తుంది చిత్ర బృందం.

నార్త్ లో పలు రాష్ట్రాలలో హీరో విజయ్ దేవరకొండ పర్యటించి ఈ సినిమాకు సంబంధించిన క్రేజ్ పెంచడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే ఆయన ప్రమోషన్స్ కార్యక్రమాలలో కూడా దృష్టి పెట్టనున్నాడు. అలా సినిమాపై ఇంట్రెస్ట్ తేవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో ఎంతటి స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇటీవల కాలంలో ఈ సినిమా కోసం ఒక హీరో ఇంతలా తాపత్రయ పడడం అనేది జరగలేదనే చెప్పాలి.

ఓవైపు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను వదులుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఇంకొక వైపు ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగా చేస్తున్నారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఈ చిత్రంపై పెట్టుకున్న నమ్మకాన్ని తన పనితనం ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక రోజుకో రాష్ట్రంలో సినిమా యొక్క ఈవెంట్ ను నిర్వహిస్తూ అక్కడ సినిమా యొక్క క్రేజ్ ను పెంచబోతున్నాడు. మరి ఈ చిత్రం ఆయనకు ఎంతటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత ఇదే దర్శకుడు తో కలిసి జనగణమన అనే మరొక సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అది వచ్చే ఏడాది ఆగస్టు మూడవ తేదీన విడుదల కాబోతుంది. మరి ఈ రెండు సినిమాలతో వీరి కాంబో ఎంతటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి. పూరీ తో సినిమా చేయడానికి ఇప్పుడు అందరు హీరోలు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: