'మీరాజాస్మిన్' మరీ ఇంత హాట్ గానా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు , తమిళ , మలయాళ ,  కన్నడ భాషా సినిమాల్లో నటించి అన్ని ప్రాంతాల్లో కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరా జాస్మిన్ , రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.  

నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన మహారథి  మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి చాలా కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మీరా జాస్మిన్  తన కెరీర్ ని కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం మీరా జాస్మిన్ కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మీరా జాస్మిన్ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తనకు మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ రీ  ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మీరా జాస్మిన్ రీ ఎంట్రీ గురించి కాసేపు పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మీరా జాస్మిన్ వైట్ కలర్ లో ఉన్న టీ షర్ట్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కి స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం మీరా జాస్మిన్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: