సమ్మె చేస్తే నాకేమి.. @4 కోట్లు.. రష్మిక..?

Divya

ఒకవైపు టాలీవుడ్ నిర్మాతల సైతం తమ సినిమాలకు బడ్జెట్ భారీగా పెరిగిపోతోందని మేకింగ్ విపరీతమైన ఖర్చు ఎక్కువ అవుతోందని నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల రేమ్యునరేషన్  తగ్గించకుంటే రాబోయే రోజులలో సినిమాలు చేయడం చాలా కష్టమని విధంగా నిర్మాతల సైతం ఏకంగా సమ్మె చేస్తున్నారు. ఇక ఈ సమ్మె ఆగస్టు ఒకటవ తేదీ నుంచి చేయడం జరిగింది. ఇక ఒకవైపు నిర్మాతలు వీరి యొక్క పారితోషకాలు మా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తూ ఉన్నారు. ఇక మరొకవైపు నుంచి నటీనటుల రెమ్యునరేషన్ను కూడా ప్రతి సినిమాకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు.

ఇక పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో పుష్ప-2 కుగాను అల్లు అర్జున్ రూ.120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం అంతా పక్కన పెడితే రష్మిక కూడా ఏకంగా ఒక్కో సినిమాకి రూ.4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప -1 కు మాత్రం కోటి రూపాయల తీసుకున్న రష్మిక ఆ తర్వాత పార్ట్ -2 కు మాత్రం నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.

నిర్మాతల సైతం మేకింగ్ ఖర్చు తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే రష్మిక మాత్రం మాకేంటి అన్నట్లుగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలియడంతో పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరికొందరు మాత్రం రష్మికకు నాలుగు కోట్లు పారితోషకం ఇవ్వచ్చు అని కొందరు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా లెవెల్లో స్టార్డం సంపాదించుకుంది.. పుష్ప-2 కి ఆ మాత్రం ఇవ్వచ్చు అనే విధంగా ఆమె అభిమానుల సైతం కామెంట్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోయిన్ ఉన్న క్రేజ్ వల్ల ఇలాంటి పారితోషకం ఇవ్వచ్చు కానీ.. మరొకవైపు నిర్మాతల పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అని మరి కొందరు మాత్రం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: