టాలీవుడ్ టాప్ హీరోల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసిన సంయుక్త మీనన్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో మొదటి సినిమాతోనే కొంతమందికి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం, జనాల్లో ఫుల్ క్రేజ్ లభిస్తుంటాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో సంయుక్త మీనన్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ లో దగ్గుబాటి రానా సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అనే మూవీ లో కథానాయకిగా నటించింది. ఈ సినిమా ఈ రోజు అనగా ఆగస్ట్ 5 వ తేదీన చాలా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే పాజిటివ్ టాక్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన సంయుక్త మీనన్ టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజాగా సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ ... తాజాగా బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడానని, జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది. అలాగే  పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం అని, పవన్ కళ్యాణ్ ఎంతో మంది కి ఇన్స్పిరేషన్ అని అన్నారు. అలానే మహేష్ బాబు ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ వంటి వారని, మహేష్ బాబు ప్రక్కన మూవీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు సంయుక్త మీనా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: