బిగ్ బాస్ కే ఝలక్ ఇచ్చిన ఉదయభాను.. అలా చెప్పేసిందట?
గతంలో యాంకర్ గా అలరించి బుల్లితెరపై హవా నడిపించిన ఉదయ భాను ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. తన గ్లామర్‌తో ప్రేక్షకులను పిచ్చెక్కించింది ఈ అమ్మడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు అలా కనిపిస్తూ మాయమై పోతుంటుంది అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోలో కి ఉదయభానుని తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. మిగతా కంటెస్టెంట్ లతో పోల్చి చూస్తే అటు ఉదయభానుకి పారితోషకం కూడా భారీగా ముట్టచెప్పేందుకు సిద్ధమయ్యారు అంటూ వార్తలు వైరల్ గా మారిపోయాయి.
అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వచ్చేందుకు అటు ఉదయభాను కు భారీగా పారితోషికం ఇస్తామని బిగ్‌బాస్ నిర్వాహకులు ఆఫర్ చేసినప్పటికీ ఈ అమ్మడు మాత్రం ససేమిరా అంటోందట. ఇప్పటికే ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయని ఉదయభాను సమాధానం ఇస్తోందట. బిగ్ బాస్ కోసం ఇక 100 రోజుల పాటు డేట్స్ కేటాయించ లేను.. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి రాలేను అంటూ క్లారిటీ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కాగా ఎన్నో రోజుల క్రితం బుల్లితెరపై కనుమరుగైన ఉదయభాను గత కొన్ని రోజుల నుంచి సందడి చేస్తోంది.