సుకుమార్ ను.. కలవడంపై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు..!!

Divya
ఇటీవల యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు, మరొక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకే చోట హోటల్లో కలిసి డిస్కషన్ చేస్తున్న కొన్ని ఫోటోలు గత కొన్ని రోజులుగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇద్దరూ కూడా పుష్ప సినిమా కథ విషయంలో ఇలా చర్చలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టేందుకే డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బుచ్చిబాబు ఈ విషయాన్ని తెలియజేస్తూ .. నా సినిమా కథ డిస్కషన్ విషయంలో మా గురువుగారు సుకుమార్ సార్ నాకు సహాయం చేయడానికి మాత్రమే వచ్చారు.. సార్ సినిమా కథలో కూర్చొని డిస్కర్షన్  చేసే అంత స్థాయి తనకు లేదని తెలియజేశారు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడం తప్ప తనకి ఇచ్చే అంత స్టామినా తన దగ్గర లేదని తెలిపారు. దీంతో మీడియా కథనాలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే.

అయితే తన తదుపరి చిత్రాన్ని ఆలస్యం చేస్తున్నాడని పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడని అతనితో సినిమా చేయాలని.. ఆ ప్రాజెక్టు పైనే ప్రస్తుతం ఎక్కువగా వర్క్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ట్ అయిన నేపథ్యంలో బుచ్చిబాబు సినిమా చేయాలంటే కాస్త రిస్కుగా అనుకుంటున్నట్లుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయినా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. తాజాగా లీకైన ఫోటోలు బట్టి బుచ్చిబాబు కథలో పాన్ ఇండియా మేక్ ఓవర్ ఉండబోతోంది అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎట్టకేలకు సుకుమార్ తో కలిసి ఉన్న ఫోటో పై క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: