జబర్దస్త్ నరేష్ పరువు తీసేసిన బామ్మ.. డైపర్లు కావాలా అంటూ?

praveen
ఇటీవల కాలంలో ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాలలో కనిపిస్తున్న కమెడియన్స్ కి అటు బయట పాపులారిటీ ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త కామెడీ పంచేందుకు ఎంట్రీ ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇలా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో జబర్దస్త్ నరేష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 తనలో ఉన్న లోపాన్ని తనకు పేవర్ గా మార్చుకుంటూ ఇక బుల్లితెర కమెడియన్స్ అందరిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో స్కిట్ లలో తన ఎనర్జీతో తన పెర్ఫార్మెన్స్ తో అందర్నీ కూడా కడుపుబ్బా నవ్వించాడు అని చెప్పాలి. ప్రస్తుతం జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్లను తీసుకువస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇలా వివిధ కళాకారులను తీసుకువచ్చి వారి టాలెంట్ ను బయట పెడుతున్నారు.

 ఇకపోతే ఇటీవల ఒక భామ్మా ఒక కార్యక్రమంలో ఏకంగా  జబర్దస్త్ నరేష్ పరువు తీసేసింది. అందరిముందే దారుణమైన కామెంట్ చేసింది. ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ఈ వారం బోనాల జాతర అని ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్రసారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో భాగంగా జానపద గీతాలు పాడే ఒక భామ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బామ్మ నీకు ఫన్ కావాలన్నా.. కామెడీ కావాలన్నా నన్ను అడుగు అని అంటాడు జబర్దస్త్ నరేష్. నీకు డైపర్లు కావాలంటే నన్ను అడుగు అంటూ కౌంటర్ వేస్తోంది భామ్మా. ఇలా  నరేష్ చిన్నగా చిన్నపిల్లాడి లా ఉన్నాడు అంటూ హేళన చేస్తూ పరువు తీసేసింది ఆ భామ్మా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: