నువ్వు ఎప్పటికీ హీరో కాలేవు.. సూపర్ స్టార్ కృష్ణని కూడా అవమానించారట?

praveen
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాదాసీదా హీరో గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తక్కువ సమయంలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను ప్రారంభించింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తొలి కౌబాయ్, తొలి కలర్ సినిమా, తొలి 70 ఎంఎం సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా ఇలా అన్నింటిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ  అని చెప్పాలి.

 మిగతా హీరోలతో పోలిస్తే చూస్తే ఎప్పుడూ భిన్నమైన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు సూపర్ స్టార్ కృష్ణ.  ఏం చేసినా కాస్త వైవిధ్యంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఎప్పుడూ ఆయన ఉండేవారు. ఇలా ఏకంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోగా తన హవా నడిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప అందగాడు కూడా. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకానొక సందర్భంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారట. నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవు అంటూ కృష్ణను ఎంతోమంది ఘోరంగా అవమానించారట.

 కృష్ణ అప్పట్లో తన కెరియర్లో ఒకే సమయంలో 12 సినిమాలలో నటించారు . కానీ సినిమాలలో ఒక్కటి  కూడా సరిగా ఆడలేదు. ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. దీంతో ఇండస్ట్రీలోని ఎంతోమంది నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవు.. ప్రేక్షకులను మెప్పించలేవు అంటూ అవమానించారట. ఇక ఆ అవమానం కారణంగా ఎంతగానో బాధ పడిన కృష్ణ ఇండస్ట్రీ లో ఎలాగైనా టాప్ ప్లేస్ లో ఉండాలని పట్టుదలతో ముందుకు సాగారు. ఇక బడిపంతులు అనే సినిమాతో ఓవర్ నైట్ లో కృష్ణ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత కృష్ణ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. సరికొత్త ప్రయోగాలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: