రణవీర్ న్యూడ్ ఫోటోలపై.. ఆలియా భట్ ఏమందో తెలుసా?
న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన నేపథ్యంలో ఇటీవలే ఈ బాలీవుడ్ స్టార్ హీరో పై ఎంతో మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం... ఇక సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం లాంటివి కూడా చేశారు. ఇటీవలే రణవీర్ సింగ్ పై కేసు కూడా నమోదు అయింది అన్న విషయం తెలిసిందే. రణవీర్ న్యూడ్ ఫోటోల పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవల ఇదే విషయం పై బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోల గురించి ప్రశ్నించగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
నాకు ఫేవరెట్ హీరో రణవీర్ సింగ్ గురించి నేను నెగటివ్ కామెంట్స్ చేయలేను అంటూ సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఇలాంటి ప్రశ్నలు భరించడం కూడా నావల్ల కాదు అంటూ చెప్పింది ఆలియా భట్. రణవీర్ సింగ్ నాకు మాత్రమే కాదు నాలాగే ఎంతో మందికి అభిమాన హీరో.. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. అలాంటి రణవీర్ సింగ్ ను మనం తిరిగి ప్రేమించాలి అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్. దీంతో ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆలియాభట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అని చెప్పాలి.