విజయ్ దేవరకొండ అందుకే అలా చేశాడా?
థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత లైగర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ ఈవెంట్కు రణవీర్ సింగ్ చీఫ్ గెస్ట్ అయినప్పటికీ స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ హైలేట్ అయ్యాడు. విజయ్ చాలా సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్.. చెప్పులు వేసుకుని హజరయ్యారు. బ్లాక్ టిషర్ట్.. క్యాజువల్ ఖార్గో పాంట్ పైకీ హవాయి చెప్పల్ ధరించి కనిపించాడు. అనంతరం విజయ్, రణవీర్ సింగ్ కలిసి స్టేజ్ పైనే స్టెప్పులేశారు. అయితే విజయ్ చెప్పులు వేసుకుని రావడం గమనించిన రణవీర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇలాంటి గ్రాండ్ ఈవెంట్కు విజయ్ చెప్పులు వేసుకుని వచ్చారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే.. ఆయన సినిమా ట్రైలర్ లాంచ్ కు నేను వచ్చినట్లు లేదు. నా సినిమా ట్రైలర్ లాంచ్ కు ఆయన వచ్చినట్లు ఉంది. అయినా.. చెప్పులతో వచ్చినా కానీ విజయ్ స్టైల్ మాత్రం అదిరింది అంటూ ప్రశంసించారు.విజయ్ మిగిలిన ఈవెంట్స్ కు వెళితే క్లాస్ లుక్ వెలతారు..తన సినిమా ఈవెంట్ కు ఇలా రావడం ఏంటీ అంటూ ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటూన్నారు..సినిమా సక్సెస్ అవుతుందని ఎవరైనా చెప్పారెమో అందుకే ఇలా చేశాడు కాబోలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..