స్పీడ్ ను పెంచిన బాలయ్య.. NBK107 షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ షురూ..
ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో బాలయ్య సరసన పొడుగు కాళ్ళ సుందరి శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆతర్వాత చిత్రయూనిట్ అంతా టర్కీకి పయనమయ్యారు. అక్కడ కొన్ని సీన్స్ తో పాటు పాటలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ కూడా షూటింగ్ ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంన్త బాలయ్య సినిమా.
NBK 107 సినిమా షూటింగ్ ను ఇప్పుడు కర్నూల్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్. గతంలో గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ సినిమాలో జయమ్మ గా వరలక్ష్మి భయపెట్టిన విషయం తెలిసిందే.. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.. ఈ సినిమా కూడా హిట్ అయితే బాలయ్య మరో రికార్డును అందుకున్నట్లే..