విజయ్ ను వదలనంటున్న పూరి జగన్నాధ్...!!
ఈ సినిమా రిలీజ్ కాకుండానే పూరి, విజయ్ కలిసి మరో సినిమాను కూడా మొదలుపెట్టారు. అదే 'జనగణమన'. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్, పూరి కలిసి మరో సినిమా చేస్తారని సమాచారం.
'జనగణమన' సినిమా చివరి దశలో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది.. అయితే ఇప్పడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చిందట.. 'లైగర్', 'జనగణమన' సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిస్తున్నారట పూరి జగన్నాద్ . మూడో సినిమాని మాత్రం సోషియో ఫాంటసీ కథతో తీయబోతున్నారని సమాచారం.. నిజానికి పూరి ఇప్పటివరకు ఇలాంటి జోనర్ ని అస్సలు టచ్ చేయలేదు. తొలిసారి ఆయన సోషియో ఫాంటసీ నేపథ్యంలో కథ రాసుకున్నారని తెలుస్తుంది.. విజయ్ కూడా ఇలాంటి జోనర్ లో అస్సలు సినిమా చేయలేదు.
సో.. వీరిద్దరికీ ఈ జోనర్ కొత్త కనుక పూరి జగన్నాధ్ దగ్గర కథలు రెడీగా ఉంటాయి. తన దగ్గర 50కి పైగా బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు చెప్పారట పూరి. అందులో మూడు కథలు తీసుకొని విజయ్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే 'లైగర్' సినిమా మాదిరి మిగిలిన రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలనుకుంటున్నారట.'లైగర్' సినిమా హిట్ అయితే ఓకే.. లేదంటే పూరి ప్లాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.. మరేం జరుగుతుందో చూడాలి.తన డైరెక్షన్ టాలెంట్ తో ఎంతో మందిని స్టార్ హీరోలను చేసిన పూరి విజయ్ కు ఎలాంటి విజయాలను అందిస్తాడో చూడాలి మరి.