టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు తన జోష్ ని ఫుల్ గా కొనసాగించిన మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీరా జాస్మిన్ తన కెరియర్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల సినిమాల్లో నటించి అన్ని ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి శివాజీ హీరోగా తెరకెక్కిన అమ్మాయి బాగుంది మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా మీరా జాస్మిన్ తెలుగు లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్ , భద్ర , మహారధి వంటి పలు భారీ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం పాటు మీరా జాస్మిన్ సినిమాలకు దూరంగా విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మీరా జాస్మిన్ మరి కొన్ని రోజుల్లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే మీరా జాస్మిన్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
దీనితో మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలకు బలం చేకూరింది. ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను , రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రేజీ కాంబో తెరకెక్కబోయే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర లో మీరా జాస్మిన్ ను తీసుకోవాలని చిత్ర బృందం అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.