ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే అక్కినేని నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కేవలం తన కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది.ఇక బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఇటీవలే 'పుష్ఫ'తో తన సత్తా చూపించిన యంగ్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్ట్ లలో వర్క్ చేస్తోంది.అయితే ఇప్పటి వరకు సమంత గ్లామర్ హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక గత కొద్ది కాలం నుంచి విభిన్న పాత్రల్లోనూ నటించేందుకు ఈ స్టార్ బ్యూటీ సై అంటోంది.అయితే ఇప్పటికే బోల్డ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్ లలో నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం లేడీ విలన్ గా ప్రేక్షకులను మెప్పించనుందని తెలుస్తోంది.ఇదిలావుండగా తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ తొలిసారిగా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. పోతే 'వారసుడు' అనే టైటిల్ తో తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రైటర్, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.ఇకపోతే టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతం అందించనున్నారు.ఇదిలావుంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే విజయ్ సినిమాకు విలన్ పాత్ర కోసం యంగ్ బ్యూటీ సమంతను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మేరకు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా విభిన్న పాత్రల్లో నటిస్తూ షాకిస్తున్న సమంత తొలిసారిగా ఫుల్ లెంన్త్ లేడీ విలన్ గా కనిపించబోతుందనడంతో అభిమానులు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.ఇకపోతే గతంతో తమిళంలో వచ్చిన చియాన్ విక్రమ్ మూవీ '10'లో సమంత కొంత నిడివి నెగెటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.ఇక ఆ మూవీ తర్వాత ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ గా నటింబోతుందని వార్తలు వస్తున్నాయి. ..!!