ఆ సినిమా నుంచి శివ కార్తికేయన్ కన్ను టాలీవుడ్ పై పడిందా..!!
తెలుగులో ధనుష్ సార్ అనే ఒక సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ కూడా ప్రిన్స్ అనే సినిమాతో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ కూడా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వారసుడు అనే చిత్రంతో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ తమిళ హీరోలలో హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ పైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టాడు అని చెప్పవచ్చు. 2016లో విడుదలైన రేమో చిత్రం ద్వారా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించారు. తెలుగు ప్రేక్షకులలో తన సినిమాకు అనూహ్యంగా ఆదరణ లభించడంతో శివ కార్తికేయ ఎక్కువగా టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడం జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చిన శివ కార్తికేయ అప్పటినుంచి తెలుగులో ఏ సినిమా విడుదలైన వెంటనే ప్రమోషన్స్ కోసం ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఇక గత ఏడాది డాక్టర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళం తో పాటు తెలుగులో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. దాదాపుగా 40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక అప్పట్నుంచి తెలుగు ఇండస్ట్రీ పై మరింత స్పెషల్ ఫోకస్ చేసినట్లుగా శివ కార్తికేయ సమాచారం. ప్రస్తుతం ప్రిన్స్, మహా వీరుడు అనే సినిమాని కూడా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.