'మేజర్' సినిమాపై ప్రశంసలు కురిపించిన విజయ శాంతి..!

Anilkumar
పాతిక సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు వారితో సమానంగా నటించిన నటి విజయశాంతి.ఈమె హీరోలతో పోటీ పడి నటించిన ఈమె వెండితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన విజయశాంతి అనంతరం సినిమాలకు దూరమై రాజకీయాలలోకి వెళ్లారు.  మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయశాంతి మరోసారి తన నటనతో మెప్పించారు. అయితే తాజాగా ఈమె మేజర్ సినిమా గురించి స్పందించారు.కాగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం మేజర్. 

ఇక ఈ సినిమా సందీప్ ఉన్నికృష్ణ న్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో జూన్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.పోతే ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన గుర్తింపు తీసుకురావడమే కాకుండా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే  ఈ సినిమాపై ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా చూసిన విజయశాంతి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఇదిలావుంటే ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయశాంతి స్పందిస్తూ...

ఎదుర్‌కుం తునిందవన్.. మేజర్ ఇక  ఈ మధ్య కొంచెం సమయ విరామ అవకాశంలో చూసిన చిత్రాలలో మానవ సంబంధాల విలువని,అంతేకాకుండా  సమాజంపై ఉండాల్సిన వివేచన వ్యక్తిత్వ తీరును మనుషుల మధ్య ఉండాల్సిన మానవత ధోరణిని భావోద్వేగాలను, దేశం పట్ల సైనికుడికి ఉండాల్సిన బాధ్యతను, సైన్యంలో చేరే వారికి ఉండే జాతీయ భావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పగలిగిన..చెప్పిన సినిమా మరో చిత్రం అనిపించాయి.అయితే  ప్రజా శ్రేయస్సులో అంకితభావంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు ఎల్లప్పుడూ అభినందనీయనమే, ఇలాంటి సినిమాలు సమాజానికి యువతకి ఎంతో అవసరం అంటూ విజయశాంతి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం మేజర్ సినిమా పై  విజయశాంతి చేసిన ట్విట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: