లింగుస్వామి... హీరో రామ్ ను ముంచేశాడుగా ?

VAMSI
గత రెండు వారాలుగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఫుల్ బజ్ క్రియేట్ చేసిన చిత్రం "ది వారియర్". ఈ రోజు ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇందులో రామ్ హీరోగా నటించగా, తనకు జోడీగా సూపర్ హిట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఇక మిగిలిన పాత్రలలో మనకు తెలిసిన నటీనటులు నటించారు. నిన్నటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్, సాంగ్స్, ట్రెయిలర్ మరియు టీజర్ లు సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో కలిగించాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాటలు వింటుంటే... రామ్ ఫ్యాన్స్ కు ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఎందుకంటే దీనికి కొన్ని విషయాలు కారణం అవుతున్నాయి.

ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి టాలీవుడ్ లో రకరకాలుగా కథనాలు వినిపించాయి. తమిళ హీరోలు హిట్ లు లేక... టాలీవుడ్ డైరెక్టర్ల వెనక పడుతుంటే రామ్ ఏంటి తమిళ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళాడు అని విమర్శలు వినిపించాయి. కానీ నేడు అదే నిజం అయింది. లింగుస్వామి కి ఎనర్జిటిక్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. కేవలం సినిమాలో మొదటి అర్ధభాగం మాత్రమే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అందులో రామ్ సత్య అనే డాక్టర్ గా ఆకట్టుకున్నాడు. అలాగే కామెడీ కూడా బాగా వర్క్ ఔట్ అయింది. అయితే సెకండ్ హాఫ్ లోనే కథ మొత్తం అడ్డం తిరిగింది. మళ్లీ పాత సినిమాల లాగే సీన్స్ రాసుకుని ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు లింగుస్వామి.

ఇక కథనం కూడా మరీ తీసికట్టుగా ఉంది. వ్యక్తిగత ప్రదర్శన మించి ఓవరాల్ సినిమా లాగా ఏమాత్రం బాగాలేదు. ఈ సినిమా కూడా యవెరేజ్ మూవీ గా రామ్ కెరీర్ లో నిలిచి పోతుంది. కొందరు అయితే నిన్నటి వరకు ఈ సినిమాను విక్రమ్ తో పోల్చారు... మరి వసూళ్లు ఈ మేరకు ఉంటాయి అనేది చూడాలి. రామ్, ఆది మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: