రామారావు మితిమీరిన నమ్మకం పై ఆశ్చర్యంలో ఇండస్ట్రీ వర్గాలు !

frame రామారావు మితిమీరిన నమ్మకం పై ఆశ్చర్యంలో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
ఒకప్పుడు తెలుగు హీరోలలో మినిమమ్ గ్యారెంట్రీ హీరోల లిస్టులో రవితేజా ముందువరసలో ఉంటూ ఉండేవాడు. అయితే హీరోల మధ్య పోటీ పెరిగిపోవడంతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడ మారిపోవడంతో ఒకప్పటి సక్సస్ ఫుల్ హీరో రవితేజా ఫెయిల్యూర్ హీరోగా మారిపోయాడు. ‘క్రాక్’ సక్సస్ కావడంతో రవితేజా తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు అని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.


అయితే ఈ సంవత్సరం విడుదలైన ‘ఖిలాడీ’ సూపర్ ఫ్లాప్ కావడంతో మళ్ళీ రవితేజా సమస్యలు మొదలయ్యాయి. దీనితో ఈనెల విడుదల కాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ పై రవితేజా మార్కెట్ ఆధారపడి ఉంది. శరత్ మండవ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ మాస్ మహారాజాకు బాగా నచ్చడంతో ఈమూవీకి సహ నిర్మాతగా కూడ రవితేజా వ్యవహరిస్తున్నాడు.


ఈసినిమాకు 35కోట్ల బడ్జెట్ అయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్థాయిలో ఈసినిమాకు బిజినెస్ రాకపోవడంతో ఈమూవీ రిలీజ్ విషయంలో కొంత గందరగోళం కొనసాగుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈమూవీని సమ్మర్ రేస్ లో విడుదల చేద్దాము అనుకున్నారు. అయితే సమ్మర్ రేస్ కు క్యూ కట్టిన భారీ సినిమాల వల్ల ఈమూవీని ఈ నెలాఖరుకు విడుదల చేస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినప్పటికీ ‘ఖిలాడీ’ ఫలితం రీత్యా ఈమూవీ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు అని అంటున్నారు. వాస్తవానికి రవితేజాకు పోలీస్ పాత్రను చేసిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని మాస్ మహారాజా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ సెంటిమెంట్ పై సినిమా బయ్యర్లకు పెద్దగా నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. దీనితో మాస్ మహారాజా రవితేజ  మితిమీరిన సాహసం చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమా ఫలితం రవితేజా నటిస్తున్న భవిష్యత్ సినిమాల పై ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: