అందుకోసమే రకుల్ ఇలా మారిందా..?

Divya
ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటో చూసిన వారంతా ఏంటి ఇలా అయింది.. ఇన్నాళ్లు ఎంతో ముద్దుగా అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎందుకు ఇలా అయింది చూస్తుండగానే ఇంతలా మారిపోయింది ఏంది అంటూ తమ అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. కేవలం శరీరం మీద కేజీ కండ కూడా కనిపించడం లేదు దానికి తోడు ముఖం బాగా పీకుపోయినట్లుగా కనిపిస్తోంది. రకుల్ ఎన్నో రోజులు నిద్రపోకుండా ఇలా కరువైనట్లుగా క్లియర్ గా కనిపిస్తోంది.

ఇంతకుముందు అందం కోసం ఎక్కువగా సర్జరీ చేయించుకోందని వార్తలు వినిపించాయి కానీ రకుల్ ప్రీతిసింగ్ ఒరిజినల్ గానే అందంగా ఉంటుందని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ అందం కోసం కాకుండా మరెందుకు ఇలా చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తాను ఇష్టపడిన నటుడు, నిర్మాత జాకీ భాగ్నానితో డేటింగ్ లో ఉన్నానంటూ తెలియజేసింది. అతడు నిర్మిస్తున్న సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ భాగస్వామ్యం అయ్యింది ఇలాంటి సమయంలోనే ఇలా కొత్తగా కనిపిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు రకుల్ ప్రీతిసింగ్ కి ఉన్న అలసట ఒత్తిడికి కారణమేంటో తెలియజేస్తుందేమో చూడాలి.
అర్జున్ కపూర్ భూమి ఫెర్నేకర్ జోడీగా నటిస్తున్న కిల్లర్స్ లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నది. ఈ ముగ్గురు తమ తదుపరి ప్రాజెక్టు కోసం చాలా ప్రిపరేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా కామెడీ క్రేజీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతుంది. 1990 లో గోవింద కామెడీ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరుగుతుంది. ఇక నిర్మాత జాకీ తో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీతిసింగ్ అతని సొంత కుటుంబ బ్యానర్ లోనే నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎక్కువగా తన మామ గారికి ఎక్కువ ప్రాయారిటీ ఇస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా కమిట్ కాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి రకుల్ ఇలా అవడానికి ముఖ్య కారణం ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: