షాకింగ్ : విక్రమ్ కి గుండె పోటు!

Purushottham Vinay
ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థత కారణంగా శుక్రవారం నాడు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఇక గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు..ఇక సన్నిహితుల సమాచారం ఇంకా అలాగే ఆసుపత్రి వర్గాల ప్రకారం నటుడు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. చెన్నైలో సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన తన రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్‌లో ఈ అగ్ర నటుడు పాల్గొనాల్సి ఉంది.విక్రమ్ అంటే విలక్షణ నటనకు పెట్టింది పేరు. ఇక టాలీవుడ్ లో మొదట్లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన విక్రమ్.. కోలీవుడ్ లో కూడా అపరిచితుడితో మంచి పేరు ఫేమ్ వచ్చింది. ఇంకా అలాగే విభిన్న చిత్రాలతో.. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్ చూపిస్తూ తనలోని నటనతో ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తూ. అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాడు.ఇక 55 ఏళ్ళు దాటినా విక్రమ్ విభిన్న పాత్రల్లో నటిస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నాడు. విక్రమ్ సినిమాల్లో హీరో పాత్ర కూడా చాలా వైవిద్యంగా ఉంటుంది.. ఇంకా పాత్రకు అనుగుణంగా తనని తాను మలచుకుంటూ.. అద్భుత నటనతోనే కాకుండా గెటప్‌లతోనూ కూడా ఎంతగానో ఆకట్టుకుంటాడు.ఇక ఇప్పుడు విక్రమ్ వరస సినిమాలను లైన్ లో పెట్టాడు.



మణిరత్నం దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్, కోబ్రా ఇంకా దర్శకుడు పా రంజిత్‌తో కొత్త చిత్రంతో సహా అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే నిర్మాణంలో వివిధ దశల్లో పలు చిత్రాలు ఉన్నాయి. ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్‌లో కూడా కనిపించాడు.ఇక ఇందులో విక్రమ్ తనయుడు నటుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించాడు.ఇంకా ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ రిలీజ్ చేశారు.అలాగే విక్రమ్ హీరోగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన కోబ్రా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మిర్నాళిని రవి ఇంకా KS రవికుమార్ అలాగే మియా జార్జ్ తదితరులు నటిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30 వ తేదీ న విడుదల కానుంది. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, శరత్ కుమార్ ఇంకా అలాగే త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: