సంక్రాంతి పండగ వచ్చింది అంటే బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అందులో భాగంగా 2023 సంక్రాంతి కోసం ఇప్పటి నుండే టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ వస్తున్నారు.
కొంత మంది హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించకపోయినప్పటికి సంక్రాంతి కి తన మూవీ లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న మెగా హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ,ఈ సినిమాకు కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా 2023 సంక్రాంతి కి విడుదల చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.