సినిమా నిర్మాతలతో ఆటాడుకుంటున్న ఓటీటీ సంస్థలు !
కమలహాసన్ కెరియర్ లోని అత్యంత భారీ హిట్ గా రికార్డులను క్రియేట్ చేసిన ‘విక్రమ్’ మూవీ ఈనెల 8న ఓటీటీ లో స్ట్రీమ్ కాబోతోంది. వాస్తవానికి ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఈమూవీ ఇప్పట్లో ఓటీటీ లోకి రాదు అని అనుకున్నారు అంతా. అయితే కేవలం నెలరోజులకే ఈ సూపర్ హిట్ మూవీ ఈవారం చివరిలో ఓటీటీ లో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది.
అదేవిధంగా నాని ఎంతో కష్టపడి నటించిన ‘అంటీ సుందరానికి మూవీ కూడ ఈవారం ఓటీటీ లో దర్శనం ఇవ్వబోతోంది. ఈమూవీ విడుదలై కేవలం నెలరోజులు మాత్రమే అయింది. ఇక అడవి శేషు నటించిన ‘మేజర్’ మూవీ కూడ ఓటీటీ లోకి అందుబాటులోకి వస్తోంది. దీనితో గత నెల విడుదలైన హిట్ సినిమాలు అదేవిధంగా ఫ్లాప్ సినిమాలు ఇలా అన్నీ కేవలం నెల రోజుల గ్యాప్ తో ఓటీటీ ప్రేక్షకులుకు అందుబాటులోకి రావడంతో ఓటీటీ సంస్థలకు హిట్స్ సినిమాలు అలాగే ఫ్లాప్ సినిమాలు అన్నీ ఒకలానే కనిపిస్తున్నాయా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
వాస్తవానికి జూలై 1నుండి ఓటీటీ లలో సినిమాలు విడుదల అయిన తరువాత 50 రోజుల తరువాత మాత్రమే అందుబాటులోకి వస్తాయి అంటూ నిర్మాతలు బహిరంగ ప్రకటనలు ఇచ్చారు. అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకున్నగా ఓటీటీ సంస్థలు ప్రవర్తించడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగి ఓటీటీ సంస్థలు హిట్ ఫ్లాప్ సినిమాలు అని తేడాలు లేకుండా ఇలా అన్ని సినిమాలను కేవలం నెలరోజుల గ్యాప్ లో జనానికి అందుబాటులోకి తీసుకువస్తే హిట్ అయిన సినిమాలకు కూడ ఎక్కడ కలక్షన్స్ వస్తాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..