'ఆదిపురుష్' ఎడిట్ వెర్షన్ ను చూసిన ప్రభాస్.. ఎమన్నాడో తెలుసా..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి మనకి తెల్సిందే.అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. ఇక రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అయితే ఇందులో రాఘవగా ప్రభాస్ కనిపించనుండగా..జానకి పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోంది.ఇకపోతే  ప్రతినాయకుడు లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ పాత్రను యువ హీరో సన్నీ సింగ్ పోషిస్తున్నారు.ఇదిలావుంటే ఇప్పటికే 'ఆది పురుష్' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఇటీవల ముంబై వెళ్లిన ప్రభాస్.. ఇప్పటివరకు జరిగిన రఫ్ ఎడిట్ వెర్షన్ ను వీక్షించారట.ఇక  దీనిపై డార్లింగ్ అండ్ టీమ్ హ్యాపీగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.ఇకపోతే
'ఆదిపురుష్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో రూపొందిస్తున్నారు. కాగా సరికొత్త అనుభూతిని అందించడానికి లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తారని సమాచారం.అయితే  ఇప్పటిదాకా ఎడిట్ చేయబడిన వెర్సన్ చాలా బాగుందని ప్రభాస్ సంతోషంగా ఫీల్ అయ్యారట.ఇక ఇందులో ప్రభాస్ మరియు కృతి సనన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అందరూ దర్శకుడు ఓం రౌత్ ను ప్రశంసించారని తెలుస్తోంది.

అయితే ఇక ఈ అవుట్ ఫుట్ తో ప్రభాస్ సైతం ఓం రౌత్ ను అభినందించారని చెబుతున్నారు. పోతే ఇది కచ్చితంగా విజువల్ వండర్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నారు.ఇదిలావుంటే 'ఆదిపురుష్' చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.  రిలీజ్ ఇంకా ఏడు నెలల సమయం కూడా లేకున్నా.. ఇంతవరకు ప్రమోషన్స్ చేయకపోవడం పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఇక ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టుకొని కనీసం ఫస్ట్ లుక్ ని విడుదల చేయకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి అభిమానుల మొర ఆలకించి మేకర్స్ త్వరలోనే 'ఆదిపురుష్' సినిమా పబ్లిసిటీ మొదలు పెడతారేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: