'ది వారియర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న బోయపాటి శ్రీను..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన రామ్ పోతినేని మరొకసారి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. రెడ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ఆఖరుగా ప్రేక్షకులను అలరించిన రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ నడుస్తూ ఉండగా, ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జూలై 1 వ తేదీన రాత్రి 7:57 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్ లాంచ్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించనున్నారు.  ఈ ఈవెంట్ ఈ రోజు అనగా జూలై 1 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శీను ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక పోతే ఇదే సమయంలో  'ది వారియర్' తమిళ్ మూవీ ట్రైలర్ ను తమిళ హీరో శివ కార్తికేయన్ డిజిటల్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ లను కూడా చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: