ప్రభాస్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు..!!

Divya
కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక తర్వాత డార్లింగ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా పేరుపొందారు. ప్రస్తుతం ఇండియా లోనే నెంబర్ వన్ స్టార్ హీరో గా కొనసాగుతున్నారు ప్రభాస్. ప్రభాస్ కెమెరా ముందుకు వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు పూర్తి అవుతుంది. 2022 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ ని హీరోగా ఈశ్వర్ సినిమాని మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు క్లబ్ కొట్టి ఆశీర్వదించారు.

సినిమా బ్యాక్ గ్రౌండ్ అనేది ఎవరికైనా ఉంటుంది అది కేవలం మొదటి సినిమా వరకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఆ తర్వాత సినిమాలలో హీరోగా తన సత్తా చాటుకోవాలి.. అలా అందుకోవడమే కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ కూడా ఈ రోజునా పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, ప్రాజెక్ట్ -k చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ 20 ఏళ్ల తన సినీ కెరీర్ ని పూర్తి చేసుకోవడంతో అభిమానులు సైతం బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఆలిండియా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరియు ప్రభాస్ అభిమానుల ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి.

కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్ ని మా గోపికృష్ణ బ్యానర్లోనే హీరోగా పరిచయం చేద్దామని ముందుగానే అనుకున్నాము.. ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్ డైరెక్టర్ జయంతి వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం తమకు ఇవ్వండి అని అడిగారు. ఈశ్వర్ సినిమా కాదని చెప్పడం జరిగింది మాస్ ఎలిమెంట్ ఉన్న కథ కాబట్టి కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఓకే చెప్పామని తెలిపారు. ఈ సినిమాని జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీశారు మాకు మంచి విజయాన్ని అందించారని తెలిపారు. ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: