ప్రస్తుతం యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఇకపోతే 'అర్జున్ సురవరం' తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు.అయితే ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన హీరో నిఖిల్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.ఇక అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. అయితే చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది.ఇక ఇదిలావుంటే 2014లో వచ్చిన 'కార్తికేయ' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
అయితే రూ.6 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం రూ.20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.అయితే ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.అయితే ఇక ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయ వీడియో, టీజర్ ఇలా ప్రతీది ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశాయి.అంతేకాదు ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ క్రమంలో ‘కార్తికేయ-2’ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు పలుకుతున్నాయట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.14కోట్లకు పైగానే రేటు పలుకుతున్నాయట.కాగా నిఖిల్ చిత్రానికి ఈ స్థాయిలో రేటు పలకడమంటే విశేషం అనే చెప్పాలి.అయితే ఇదిలావుంటే అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 22న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది...!!