'సీతా రామం' టీజర్ అఫీషియల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
ప్రేమ కథలను వెండి తెరపై ఆవిష్కరించడం లో స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరో గా సీతా రామన్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిం దే .  హను రాఘవపూడి ఇది వరకు అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ,  పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథ సినిమా లను వెండి తెరపై ఆవిష్కరించి ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు .
 

ఇలా ప్రేమ కథ లను వెండి తెరపై ఆవిష్కరించడం లో స్పెషలిస్ట్ దర్శకుడు అయిన హను రాఘవపూడి 'సీతా రామన్' సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండటం , ఈ సినిమా కూడా ప్రేమ కథ కావడం తో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ,  రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది . రష్మిక మందన ఈ సినిమా లో ఆఫ్రిన్ అనే పాత్రలో కనిపించబోతోంది . ఈ సినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ , ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు .

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది . సీతా రామం మూవీ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: