మెగాస్టార్
చిరంజీవి క్రేజ్ మాములుగా ఉండదు.తాజాగా
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.అయితే
మెగాస్టార్ తనయుడు.. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇకపోతే ఈ
సినిమా తర్వాత ఇప్పుడుచిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేశారు. అయితే ఇప్పటికే
మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాను
రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో
నయనతార మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనున్నారు. అంతేకాక అలాగే
బాలీవుడ్ కండల వీరుడు
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ
సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. అంతేకాదు అలాగే ఈ
మూవీ తర్వాత
మెహర్ రమేష్ దర్శకత్వంలో
సినిమా చేస్తున్నారు చిరు.ఇకపోతే
తమిళ్ సూపర్ హిట్ వేదాళం సినిమాను తెలుగులో
రీమేక్ చేస్తున్నారు చిరు. కాగా ఈ సినిమాకు బోళాశంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమాలో కీర్తిసురేష్
మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది.
అయితే ఇప్పటికే విడుదలైన ఈ
సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పోతే ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి.అయితే నేటినుంచి ఈసినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.కాగా రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. ఇక దీని కోసం ఆర్ట్
డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఓ భారీ సెట్ ను నిర్మించారని వెల్లడించారు. అంతేకాకుండా అలాగే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మెహర్ రమేష్.ఇకపోతే ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఓ ఫోటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక తమన్నా ఈ సినిమాలో
మెగాస్టార్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది..!!