వన్ సైడ్ లవ్ లో హీరోయిన్..! ఇది నిజం..!
అనుపమ పరమేశ్వరన్ లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేసింది. మళయాళీ మూవీ 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో కూడా ప్రేమకథలతోనే హిట్ కొట్టింది. అయితే సినిమాల్లోనే కాదు, రియల్‌లైఫ్‌లోనూ లవ్‌స్టోరి ఉందని చెప్పింది అనుపమ. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో స్టేటస్ గురించి మాట్లాడింది అనుపమ. ప్రేమలో ఉన్నానని చెప్పింది.
అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడ్డానని చెప్పింది గానీ, ప్రేమికుడి పేరు మాత్రం చెప్పలేదు. నేను ప్రేమిస్తున్నాను గానీ, అతను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు. ఇప్పటివరకు అతని దగ్గర లవ్ ఎక్స్‌ప్రెస్ చేయలేదు, ప్రస్త్రుతానికైతే వన్‌సైడ్ లవ్ అని చెప్పింది. మరి అనుపమ ప్రేమిస్తుంది సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వాళ్లా, బయటివాళ్లా అనేది మాత్రం రివీల్ చేయలేదు.
అనుపమ పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు కూడా చెప్పిందట. లవ్ మ్యారేజే చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్‌పైన ఇంట్రెస్ట్ లేదని చెప్పిందట. ఇక అనుపమ నిర్ణయానికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మద్దతిచ్చారని చెప్పింది. సినిమాల విషయానికి వస్తే నిఖిల్‌తో '18 పేజెస్, కార్తికేయ2' చేస్తోంది. వీటితోపాటు 'బటర్‌ఫ్లై' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా లైన్‌లో ఉంది.
నిప్పులేనిదే పొగరాదు అంటారు.. అలాంటిది సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కొన్ని వాస్తవాలైతే.. మరికొన్ని ఊహాగానాలు. ఎక్కువ శాతం ఊహాగానాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది నటీనటులు తమపై వచ్చే రూమర్స్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ శృతిమించిపోతే తప్ప.. అందులో జోక్యం చేసుకోరు. అయితే అనుపమ పరమేశ్వరన్ పై సోషల్ మీడియాలో మొదట వచ్చిన గాసిప్స్ అబద్దమైతే.. రెండోసారి వచ్చిన గాసిప్స్ నిజమయ్యాయి. అది అనుపమ పరమేశ్వరన్ కూడా ఒప్పుకోవడంతో ఆ రూమర్స్ కు బలం చేకూరింది. మరి ఆమె ప్రేమించేది ఎవరినో అని.. చిత్ర పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎప్పటికైనా అనుపమ బయటపడి చెప్పకపోతుందా అని వెయిట్ చేస్తోంది.