సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడు బ్లాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాడని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ తర్వాత అలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర పొందలేకపోయాడు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.O మూవీ తో మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడు అని ఎంతో మంది రజనీకాంత్ అభిమానులు ఆశించారు. కాకపోతే ఆ సినిమా ఆశించిన రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా రజనీకాంత్ 'అన్నాత్తే' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇలా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్న రజినీ కాంత్ మరి కొన్ని రోజుల్లో తమిళ క్రేజీ దర్శకుడు ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన రోబో మూవీ తర్వాత మరో సారి ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు రజినీ కాంత్ స్వయంగా కథను రాసుకున్నట్లు, ఆ కథకు కె ఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే ను అందించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ మూవీ లో శివ కార్తికేయన్ కూడా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి చిత్ర బృందం ఒక క్రేజీ టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. రజనీ కాంత్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు 'బాస్' అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.