నాని ఆఖరి 5 సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!
అంటే సుందరానికి : నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా తాజాగా 10 జూన్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదలయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.87 కోట్ల కలెక్షన్లను సాధించింది.
శ్యామ్ సింగరాయ్ : నాని హీరోగా సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా మడోనా సబాస్టియన్ కీలకపాత్రలో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
గ్యాంగ్ లీడర్ : నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.57 కోట్ల కలెక్షన్లను సాధించింది.
జెర్సీ : నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.47 కోట్ల కలెక్షన్లను సాధించింది.
దేవదాస్ : నాని మరియు నాగార్జున హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమా విడుదలైన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్లను సాధించింది.