అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తోంది .
మేజర్ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచ నాలు కలిగి ఉండటంతో మేజర్ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ప్రపంచ వ్యాప్తంగా మేజర్ మూవీ కి దాదాపు 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, 19 కోట్ల టార్గెట్ తో మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది. 19 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన మేజర్ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 25.60 కోట్ల షేర్ , 46.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
7 రోజులు పూర్తయ్యే సరికి మేజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.60 కోట్ల లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది . ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్ గా నిలిచిన మేజర్ సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది .